======================================================================
LibreOffice 4.0 రీడ్‌మీ
======================================================================

ఈ రీడ్మీ ఫైల్ కు తాజాకరణలకోసం  http://www.libreoffice.org/welcome/readme.html లింకు చూడండి.

ఈ LibreOffice అనువర్తనం గురించి ముఖ్యమైన  వివరాలు ఈ ఫైల్ లో వున్నాయి. వాడటానికి ముందుముందు చాలా జాగ్రత్తగా ఈ వివరాలు చదవండి

దీని వుత్పత్తికి భాధ్యత వహించిన LibreOffice సముదాయం మిమ్ములను సముదాయ సభ్యునిగా ఆహ్వానిస్తున్నది. కొత్త వాడుకరిగా మీరు LibreOffice సైట్ సందర్శించవచ్చు, మీరు యిక్కడ  LibreOffice ప్రోజెక్ట్  సంబందించి చాలా సమాచారం కనుగొందురు. http://www.libreoffice.org/ చూడండి.

LibreOffice ఎవరికైనా ఉచితమేనా? 
----------------------------------------------------------------------

LibreOffice అందరికి ఉచితం.  LibreOfficeనకలు తీసుకొని  మీకు కావలసినన్ని కంప్యూటర్లపై స్థాపించవచ్చు, మరియు ఏ అవసరానికైనా(వ్యాపార, ప్రభుత్వ, ప్రజాపాలన, విద్య తోపాటు). మరిన్ని వివరాలకు  LibreOffice తోజతచేసిన లైసెన్సు  పాఠ్యం చూడండి .

LibreOffice ఎందుకని ఎవరికైనా ఉచితం?
----------------------------------------------------------------------

LibreOffice ఉచితంగా వాడుకొనవచ్చు ఎందుకంటే , వ్యక్తులు, సంస్థ దాతలు దీని నిర్మాణానికి, పరీక్షకు, అనువాదాలకు, పుస్తకాలకు, సహాయానికి, ప్రచారానికి  చాలా రకాలుగా  ఈ  LibreOffice -  ప్రపంచపు  ప్రజాదరణ గల స్వేచ్ఛా మూలాల ఉత్పాదకత సాఫ్ట్వేర్ ఇంట్లోకి మరియు కార్యాలయానికి,  స్థాయి కి తీసుకొచ్చారు  

మీరు వారి పనిని మెచ్చుకొవాలనిపిస్తే మరియుLibreOfficeభవిష్యత్ స్థిరంగా వుండాలనుకుంటే, విరాళం చేయటం గురించి ఆలోచించండి. http://www.documentfoundation.org/contribution/ చూడండి. ప్రతి ఒక్కరు సహాయం చేయవచ్చు.

----------------------------------------------------------------------
నోట్ లను నెలకొల్పడం
----------------------------------------------------------------------

పూర్తి ప్రమేయత కొరకు LibreOffice కు సరికొత్త జావా రన్‌టైమ్ యెన్విరాన్మెంట్ (JRE) అవసరం. JRE అనునది LibreOffice సంస్థాపన ప్యాకేజీ నందు బాగంకాదు, అది ప్రత్యేకంగా సంస్థాపించాలి.

వ్యవస్థ అవసరాలు:
----------------------------------------------------------------------

సాధారణ నియమంగా,  LibreOffice స్థాపించుట  మీరువాడే  లినక్స్ పంపిణి  సిఫారస్ చేయబడిన స్థాపించు పద్ధతులు ద్వారా మీరు స్థాపించాలి.  ( ఉబుంటు లినక్స్ అయితే  ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్  వాడుట )  ఎందుకంటే,  వ్యవస్థ తో  అత్యంత అనుకూలమైన సమాకలనం చెందిన  స్థాపించు పద్ధతి  సులభమైనది.  మీరు లినక్స్  నిర్వహణ వ్యవస్థని తొలిసారి స్థాపించునప్పుడు అప్రమేయం గా (LibreOffice  ఇప్పటికే స్థాపించబడివుండవచ్చు.

"stand-alone" LibreOffice స్థాపన మునుజూపు కావలసిన వాడుకరుల కొరకు, లేక ప్రత్యేకమైన అవసరాలకు,  సాధారణం కాని వాటికోసం  అందచేయబడింది. 

* లినక్స్  కెర్నెల్ రూపాంతరము  2.6.18 లేక తరువాతది
* glibc2 రూపాంతరము 2.5  లేక తరువాతది
* gtk రూపాంతరము 2.10.4 లేక తరువాతది
* Pentium సారూప్యత గల PC (Pentium III లేదా Athlon సిఫార్సు చేయడమైనది)
* 256 MB RAM (512 MB RAM సిఫార్సుచేయడమైనది)
* హార్డ్ డిస్క్ లో 1.55 మెగాబైట్లు  వరకు ఖాళీ వుండాలి
* X సేవిక 1024x768 తీవ్రతతో (అధిక తీవ్రత సిఫార్సుచేయడమైనది), కనీసం 256 రంగులతో
* Gnome 2.16 లేక తరువాతది, gail  1.8.6 మరియు at-spi 1.7  పాకేజీలు (ఎసిస్టివ్ టెక్నాలజీ  [AT] సాధనాల తోడ్పాటు కొరకు కావాలి), లేక వేరొక సరిపోయే GUI ( KDE,  మరికొన్ని అలాంటివి).

లినక్స్ పంపిణీలు అనేకం. ఒక్కో పంపిణీలో స్థాపన ఎంపికలు వివిధరకాలు (KDE లేక గనోమ్..). కొన్ని పంపిణీలు LibreOffice యొక్క ‘మాతృ’ రూపాంతరము తో వుండవచ్చు.దాని లక్షణాలు  LibreOfficeసముదాయ రూపాంతరము కన్నా భిన్నంగా వుండవచ్చు. మాతృ రూపాంతరముతో పాటు LibreOffice సముదాయ రూపాంతరము స్థాపన కొన్ని సార్లు వీలవవచ్చు. అయితే  సముదాయ రూపాంతరమును స్థాపించుటకు ముందు మాతృ రూపాంతరమును తొలగించుట మంచిది. ఈ పనిచేయుటకు, మరిన్ని వివరాల కోసం మీ పంపిణి పత్రాలు పరిశీలించండి. 

మీరు సాఫ్ట్వేర్ తొలగించుట లేక స్థాపించే ముందు, మీ వ్యవస్థ లో  దత్తాంశాలను భద్రపరచుకొవడం (బ్యాక్ అప్) మంచి పద్ధతి.

మీ వ్యవస్థలోని తాత్కాలిక సంచయంలో  చాలినంత ఖాళీ మెమరీ   వున్నదని, మరియు రాయుట, చదువుట మరియు నడుపుట హక్కులు ఇవ్వబడినవని నిర్ధారించుకోండి.  స్థాపనాపద్ధతి   ప్రారంభించే  ముందు, అన్ని ఇతర ప్రోగ్రాములు మూయండి.

డెబియన్/ఉబుంటు అధారిత లినక్స్  వ్యవస్థలకొరకు LibreOffice స్థాపన 
----------------------------------------------------------------------

మీరు LibreOffice యొక్క క్రితం వర్షన్ యిప్పటికే సంస్థాపించి కలిగివుంటే, కొనసాగుటకు ముందుగా మీరు దానిని నిర్మూలించవలసి వుంటుంది. భాగా ప్యాక్‌ను యెలా సంస్థాపించాలి అనేదానిపై సమాచారం కొరకు (LibreOffice యొక్క ఆంగ్ల వర్షన్ కలిగినతరువాత), భాషా ప్యాక్ సంస్థాపనకు చెందిన కింది విభాగంను చదువుము.

డౌనులోడు ఆర్కైవు విప్పిచూసినపుడు,  దానిలోని విషయాలు ఉపసంచయంలో సాధారణ పరిమాణస్థాయిలోకి మార్చబడినవిగా తెలుస్తుంది. ఫైల్ నిర్వాహకి విండో తెరచి "LibO_" తరువాత రూపాంతరము సంఖ్య మరియు ప్లాట్ఫారం వివరం  వున్న  సంచయంలోకి వెళ్లండి.

ఈ సంచయంలో "DEBS" అనే ఉపసంచయం వుంటుంది. దానిలోకి మారండి.

సంచయం లో మౌస్ పై కుడి మీట నొక్కి "టర్మినల్ లో తెరుచు" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి క్రింది ఆదేశం ప్రవేశపెట్టండి ( ఆదేశం నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):

sudo dpkg -i *.deb

dpkg ఆదేశం స్థాపించు పద్ధతిలో మొదటి భాగం పూర్తిచేస్తుంది. పద్ధతి పూర్తవడానికి, రంగస్థలం సమాకలనం పాకేజీలు స్థాపించాలి. ఇదిచేయుటకు,  "DEBS"సంచయంలో "desktop-integration" సంచయం లోకి ఈ క్రింది ఆదేశం ద్వారా మారండి

cd desktop-integration

ఇప్పుడు మరల dpkg ఆదేశం నడుపు :

sudo dpkg -i *.deb

స్థాపించు పద్ధతి ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు LibreOffice  యొక్కఅన్ని అనువర్తనములకు చిహ్నాలురంగస్థలంలో అనువర్తనములు/కార్యాలయం  లో వుండాలి.

RPM  పాకేజీలు వాడి ఫెడోరా, సూసె,  మాండ్రివా మరియు ఇతర  లినక్స్  వ్యవస్థలలో LibreOffice స్థాపన
----------------------------------------------------------------------

మీరు LibreOffice యొక్క క్రితం వర్షన్ యిప్పటికే సంస్థాపించి కలిగివుంటే, కొనసాగుటకు ముందుగా మీరు దానిని నిర్మూలించవలసి వుంటుంది. భాగా ప్యాక్‌ను యెలా సంస్థాపించాలి అనేదానిపై సమాచారం కొరకు (LibreOffice యొక్క ఆంగ్ల వర్షన్ కలిగినతరువాత), భాషా ప్యాక్ సంస్థాపనకు చెందిన కింది విభాగంను చదువుము.

డౌనులోడు ఆర్కైవు విప్పిచూసినపుడు,  దానిలోని విషయాలు ఉపసంచయంలో సాధారణ పరిమాణస్థాయిలోకి మార్చబడినవిగా తెలుస్తుంది. ఫైల్ నిర్వాహకి విండో తెరచి "LibO_" తరువాత రూపాంతరము సంఖ్య మరియు ప్లాట్ఫారం వివరం  వున్న  సంచయంలోకి వెళ్లండి.

ఈ సంచయంలో "RPMS" అనే ఉపసంచయం వుంటుంది. దానిలోకి మారండి.

సంచయం లో మౌస్ పై కుడి మీట నొక్కి "టర్మినల్ లో తెరుచు" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి క్రింది ఆదేశం ప్రవేశపెట్టండి ( ఆదేశం నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):

ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు: su -c 'yum install *.rpm'

మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు: sudo urpmi *.rpm

ఇతర RPM-అధార వ్యవస్థ (Suse, etc.): rpm -Uvh *.rpm

పై ఆదేశం స్థాపించు పద్ధతిలో మొదటి భాగం పూర్తిచేస్తుంది. పద్ధతి పూర్తవడానికి, రంగస్థలం సమాకలనం పాకేజీలు స్థాపించాలి. ఇదిచేయుటకు,  "RPMS"సంచయంలో "desktop-integration" సంచయం లోకి ఈ క్రింది ఆదేశం ద్వారా మారండి

cd desktop-integration

స్థాపించు ఆదేశం మరల  నడుపు: 

ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు:  su -c 'yum install *freedesktop*.rpm'

మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు:  sudo urpmi *mandriva*.rpm

SUSE-ఆధారిత వ్యవస్థల కొరకు: rpm -Uvh *suse*.rpm

ఇతర RPM-ఆధారిత వ్యవస్థల కొరకు: rpm -Uvh *freedesktop*.rpm

స్థాపించు పద్ధతి ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు LibreOffice  యొక్కఅన్ని అనువర్తనములకు చిహ్నాలురంగస్థలంలో అనువర్తనములు/కార్యాలయం  లో వుండాలి.

పై స్థాపన  సూచనలు సరిపోని  వారి లినక్స్  పంపిణిలలో రంగస్థలం సమాకలనం కొరకు గమనికలు
----------------------------------------------------------------------

స్థాపన సూచనలలో లేని ఇతర  లినక్స్  పంపిణిలలో LibreOffice స్థాపించుట వీలవుతుంది. రంగస్థలం సమాకలనంలో  ప్రధాన తేడాలుండవచ్చు.

రంగస్థలం సమాకలనం సంచయం లో  libreoffice3.3-freedesktop-menus-3.3.1.noarch.rpm (లేక అటువంటిది) అనే కవిలె వుంటుంది. (http://en.wikipedia.org/wiki/Freedesktop.org) నియమాలు/సిఫారసులకు తోడ్పాటు వుండే అన్ని లినక్స్ పంపిణీలకు ఇది సరిపోతుంది. ఇంతకుముందు  సూచనలలో లేని  యితర లినక్స్ పంపిణీలలో స్థాపనకోసం యివ్వడమైనది.

భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) స్థాపించు
----------------------------------------------------------------------

మీకు కావలసిన కంప్యూటర్ ప్లాట్ఫారం లో  మీ కిష్టమైన  భాష కొరకు భాష కవిలె (లాంగ్వేజ్ పాక్)  పొందండి.  ప్రధాన  స్థాపన ఆర్కైవు ఎక్కడ పొందారో అక్కడే  అవికూడా వుంటాయి. నాటిలస్ ఫైల్ నిర్వాహకి నుండి, పొందిన ఆర్కైవు మీకు కావలసిన సంచయంలో  (ఉదాహరణకు రంగస్థలం (desktop))  విప్పండి.  LibreOffice  అనువర్తనముల (QuickStarter తో సహా, అది ప్రారంభమైవుంటే)  నుండి నిష్క్రమించారని నిర్ధారించుకోండి

మీరు పొందిన  భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) ఎక్కడ విప్పారో అ సంచయంలోకి మారండి

మీరు పొందినది ఎక్కడ విప్పారో అ సంచయంలోకి మారండి. ఉదాహరణకు 32 -బిట్ డెబియన్/ఉబుంటు అధార వ్యవస్థ లో ఫ్రెంచ్  భాష కవిలె (లాంగ్వేజ్ పాక్)   సంచయం  పేరు "LibO + రూపాంతర సమాచారం + Linux_x86_langpack-deb_fr".

మీరు  ఏ సంచయంలో  స్థాపన కవిలెలు (పాకేజీలు)  వున్నాయో  అ సంచయంలోకి మారండి. ఉదాహరణకు  డెబియన్/ఉబుంటు అధార వ్యవస్థ లో  DEBS అనే సంచయం. ఫెడోరా, సూసె,మాండ్రీవా వ్యవస్థలలో  సంచయం పేరు RPMS.

నాటిలస్ ఫైల్ నిర్వాహకిలో  మీకు కావలసిన సంచయం పై మౌస్  సూచికను వుంచి, కుడి మీట నొక్కి "టర్మినల్ లో తెరుచు" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి భాష కవిలె (లాంగ్వేజ్ పాక్)   స్థాపన ఆదేశం నడపండి (  ఈ క్రింది ఆదేశాలన్నిటిని నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):

డెబియన్/ఉబుంటుఅధార వ్యవస్థలకు: sudo dpkg -i *.deb

ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు: su -c 'yum install *.rpm'

మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు: sudo urpmi *.rpm

ఇతర RPM-అధార వ్యవస్థ (Suse, etc.): rpm -Uvh *.rpm

LibreOfficeఅనువర్తనములలో ఒకదానిని ప్రారంభించుటకు - ఉదాహరణకు రైటర్ ప్రారంభించాలంటే,  పనిముట్లు మెనూలో  ఎంపికలు (Options) కు వెళ్లండి. ఎంపికలు సంవాద పెట్టెలో "భాషా అమర్పులు"  లో  భాషలు నొక్కండి.  వాడుకరి అంతర్ముఖం జారుడు పెట్టెలో  మీరు స్థాపించిన  భాష ఎంచుకోండి.  అవసరమనుకుంటే, స్థానికత అమర్పులు,అప్రమేయ ద్రవ్యం,  పత్రాల కొరకు అప్రమేయ భాష అలాగే చేయొచ్చు.

అమర్పులు మార్చినతరువాత,  సరే నొక్కండి. సంవాద పెట్టె మూయబడుతుంది.  మీరు చేసిన మార్పులు LibreOffice  ను నిష్క్రమించి  మరల ప్రారంభించితేనే  చేతనమవుతాయనే సందేశం కనబడుతుంది. (QuickStarter  ప్రారంభమైవుంటే దానిని కూడా నిష్క్రమించాలని గుర్తుంచుకోండి) 

తరువాత సారి LibreOffice     ప్రారంభించినపుడు , మీరు స్థాపించిన భాషతో ప్రారంభమవుతుంది.

----------------------------------------------------------------------
ప్రోగ్రామ్ స్టార్టప్‌నందు సమస్యలు
----------------------------------------------------------------------

LibreOffice ప్రారంభించుటలో సమస్యలు (ఉ.దా. అనువర్తనములు స్థంబించుట) అదేవిధంగా తెర ప్రదర్శనలో సమస్యలు అనునటువంటివి తరచుగా గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్ వలన కలుగుతాయి. ఈ సమస్యలు యెదురైతే, మీ గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్‌ను నవీకరించుము లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యివ్వబడిన గ్రాఫిక్స్ డ్రైవర్ వుపయోగించి ప్రయత్నించుము. 3D ఆబ్జక్టులను ప్రదర్శించుటలో సమస్యలను 'Tools - Options - LibreOffice - View - 3D view' క్రిందని "Use OpenGL" ఐచ్చికాన్ని అచేతనం చేయుటద్వారా పరిష్కరించవచ్చును.

----------------------------------------------------------------------
అడ్డ దారి మీటలు
----------------------------------------------------------------------

నిర్వహణ వ్యవస్థ వాడని లఘు మీట(మీటల కలయిక) LibreOffice లో వాడవచ్చు. మీటల కలయిక LibreOffice సహాయంలో చెప్పినట్లుగా LibreOfficeలో పనిచేయకపోతే  , అది నిర్వహణ వ్యవస్థ వాడిందేమోచూడండి. అటువంటి ఘర్షణలను సరిచేయటానికి మీ నిర్వహణ వ్యవస్థ  లో కాని LibreOfficeలో కాని మార్పులు చేయవచ్చు. మరింత సమాచారంకొరకు  LibreOffice సహాయం లేక నిర్వహణ వ్యవస్థ సహాయ పత్రాలను చూడండి.

----------------------------------------------------------------------
ఫైల్ ను నిరోదించు
----------------------------------------------------------------------

LibreOffice లో ఫైల్ తాళంవేయడం అప్రమేయంగా జరుగుతుంది. నెట్వర్క్ లో NFS వాడుతున్నట్లయితే,  NFS clients ల లాకింగ్ డీమన్చేతనంగా వుండాలి. ఫైల్ లాకింగ్ అచేతనం చేయుటకు soffice స్క్రిప్ట్ లో  "export SAL_ENABLE_FILE_LOCKING" ను "# export SAL_ENABLE_FILE_LOCKING " గా మార్చండి. ఫైల్ లాకింగ్ అచేతనం చేసినట్లయితే రాయు హక్కులు మొదటిగా తెరచిన వ్యక్తికి మాత్రమే వుండవు. 

హెచ్చరిక: చేతనమైన ఫైల్ లాకింగ్ Linux NFS 2.0 తో వాడుతున్న Solaris 2.5.1 మరియు 2.7 లకు సమస్య కాగలదు. ఇటువంటి వ్యవస్థ మీదైతే ఫైల్ లాకింగ్ వాడవద్దని సిఫారస్ చేస్తున్నాము.  లేకపోతే LibreOffice  లినక్స్ కంప్యూటర్లో  NFS అనుసంధానించిన సంచయంలో ఫైల్ తెరిచినపుడు ఈ అనువర్తనం పని నిలిచిపోతుంది, 

----------------------------------------------------------------------
గ్రాఫిక్  సమర్థత
----------------------------------------------------------------------

అప్రమేయం గా  LibreOffice  వేగం కన్నా అందంగా వుండే  గ్రాఫిక్స్ యిష్టపడుతుంది.  మీ గ్రాఫిక్స్ త్వర త్వరగా కనబడకపోతే,  'Tools - Options - LibreOffice - View - Use Anti-Aliasing' ను ఆపుచేయటం వుపయోగంగా వుండవచ్చు

----------------------------------------------------------------------
ముఖ్యమైన అనుకూలపరచు  గమనికలు
----------------------------------------------------------------------

LibreOffice నందు ఏక్సెసబిలిటీ విశేషణాలపై మరింత సమాచారం కొరకు, చూడండి http://www.libreoffice.org/accessibility/

----------------------------------------------------------------------
వాడుకరికి సహకరించు 
----------------------------------------------------------------------

http://www.libreoffice.org/support/ ద్వారా  LibreOffice సహాయానికి వివిధరకాల వివరాలు తెలుస్తాయి. మీ ప్రశ్న కు  ఇప్పటికే సమాధానం వుండివుండవచ్చు  -http://www.documentfoundation.org/nabble/ చూడండి లేక  http://www.libreoffice.org/lists/users/ చూడండి. బదులుగా మీ ప్రశ్నలను users@libreoffice.org కు మెయిల్ చేయండి.  users+subscribe@libreoffice.org కు ఖాళీ మెయిల్ పంపి  చందాదారు గా చేరండి.

తరచుగా అడిగే ప్రశ్నలకు http://www.libreoffice.org/faq/. చూడండి

----------------------------------------------------------------------
బగ్ & సమస్యలు నివేదన
----------------------------------------------------------------------

నివేదించుటకు, ట్రాకింగ్ మరియు బగ్‌లను పరిష్కరించుటకు మా వ్యవస్థ బగ్‌జిల్లా, https://bugs.freedesktop.org/ వద్ద హోస్టై వుంది. మీ ప్లాట్‌ఫాం పైన వచ్చిన అన్ని బగ్‌లను  నివేదించమని మేము వాడుకరులందరిని అడుగుతున్నాము. LibreOffice యొక్క మెరుగుదల మరియు అభివృద్ది కొరకు అందించు ప్రోత్సాహంలో చురుకుగా బగ్‌లను నివేదించుట కూడా చాలా ముఖ్యమైన సహకారం.

----------------------------------------------------------------------
తీసుకొని చిక్కుకున్న
----------------------------------------------------------------------

LibreOffice సముదాయం ఈ ముఖ్యమైన స్వేచ్ఛా మూల పథకంలో మీ క్రియాశీలక భాగస్వామ్యంతో చాలా లాభపడుతుంది. 

వాడుకరి గా, మీరు ఈ అనువర్తనాల అభివృద్ధి పద్ధతిలో చాలా  విలువైన భాగమయ్యారు సముదాయంలోఇంకా ఎక్కువ క్రియాశీలక పాత్ర  తీసుకోటానికి ప్రోత్సహిస్తున్నాము. సభ్యునిగా చేరండి మరియు మీరు  వాడుకరులు  http://www.libreoffice.org/contribution/ గురించి తెలుసుకోండి.

ప్రారంభముకు దారి
----------------------------------------------------------------------

LibreOffice మూలాలు  అక్టోబరు  2000 లో విడుదలయ్యాయి సహాయపడటానికి మంచి  పద్ధతి ఏమిటంటే, ఒకటి లేక అంతకన్నా మెయిలింగ్ లిస్టులలో చేరటం, కొన్నాళ్లు  గుంటనక్కలా గమనించటం,  క్రమంగా  మెయిల్ అర్కైవులను వుపయోగించి చాలా  చర్చావిషయాలు తెలుసుకోవడం మీరు సిద్ధమైనప్పుడు మీ స్వపరిచయ ఈమెయిల్ తో  పనిమొదలెట్టడం మీకు స్వేచ్ఛా మూలాల పథకాలగురించి తెలిసివున్నట్లయితే,  మీకు  యిష్టమైనది ఏదైనా వుందా అని, మా http://www.libreoffice.org/develop/ చూడండి.

చందాదారుకండి
----------------------------------------------------------------------

మీరు చందాదారుగామారి సహయపడాలనుకుంటే  వుపయోగపడే  మెయిలింగ్ లిస్టులలో కొన్ని http://www.libreoffice.org/contribution/

* వార్తలు: announce@documentfoundation.org *అన్ని వాడుకరులకు సిఫారస్ చేయబడినది* (కొద్దిపాటి సంభాషణలు)
* ముఖ్య వాడుకరి జాబితా: users@global.libreoffice.org *చర్చలలో పాల్గొనుటకు సులువైన మార్గం* (అధిక ట్రాఫిక్)
* ప్రచార పథకం: marketing@global.libreoffice.org *అభివృద్ధి తర్వాత* (అత్యంత ఎక్కువ సంభాషణల స్థాయికి చేరుతోంది)
* సాధారణ  అభివృద్ధికారి జాబితా: libreoffice@lists.freedesktop.org  (అత్యంత ఎక్కువ సంభాషణలు)

ఒకటి లేక ఎక్కువ పథకములు చేర్చు
----------------------------------------------------------------------

పెద్దవైన సహాయాన్ని మీకు సాఫ్ట్వేర్ అనుభవం అంతగాలేకపోయినా చేయవచ్చు. అవును. మీరే!

మీరు  కొత్త LibreOffice 4.0 తో పనిచేయుటను అనందిస్తున్నారని మరియు ఆన్‌లైన్ నందు మాతో చేరుతారని ఆశిస్తున్నాము.

 లిబ్రెఆఫీస్ సముదాయం

----------------------------------------------------------------------
ఉపయోగించుట/ మార్పు వనరు సంకేతం
----------------------------------------------------------------------

Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.